ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan Vs Sharmila : వైఎస్సార్ జయంతి సాక్షిగా వైఎస్ జగన్ రెడ్డి వర్సెస్ షర్మిల.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ..!

ABN, First Publish Date - 2023-07-08T20:32:41+05:30

అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే.. ఈ కార్యక్రమానికి షర్మిల వర్సెస్ వైఎస్ జగన్‌గా (Sharmila Vs Jagan) ఒక్క సీన్ జరిగింది.. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించే చర్చించుకుంటున్నారు.


ఇదీ అసలు కథ..

వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు జిల్లాలోనే మూడ్రోజుల పాటు వైఎస్ జగన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఎలాంటి అనుమతి లేదని పాసుల (Media Pass) జారీని ప్రజా సంబంధాల శాఖ నిలిపివేసింది. అంతేకాదు.. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ (YSR Ghat) వద్ద జరిగే కార్యక్రమాలకు సైతం మీడియాకు అనుమతి లేదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచే జగన్ రెడ్డి కార్యక్రమాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, లైవ్‌లు అందిస్తామని కూడా తెలిపింది. అంతేకాదు.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నమనేదానికి కూడా కారణాలు చెప్పింది. అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య నేతలు భారీగా వస్తుండటంతో స్థలాభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామే తప్ప మరో కారణం లేదని తెలిపింది ప్రజా సంబంధాల శాఖ. అయితే ఈ విషయం తెలుసుకున్న వైఎస్ షర్మిల మీడియాను రాకుండా ఆంక్షలు విధించడమేంటి..? ఒకింత ఆగ్రహానికి లోనయ్యారట. దీంతో వెంటనే తన పర్యటనకు సంబంధించి మీడియా కవరేజికి రావాలంటూ ప్రత్యేకంగా షర్మిల ఆహ్వానించారు. కడప జిల్లాలో తన పర్యటనే కాదు.. ఇడుపులపాయలో (Idupulapaya) కూడా కవరేజి (Media Coverage) రావొచ్చని.. ఎలాంటి ఆంక్షలు లేవని తన వ్యక్తిగత సిబ్బందితో ప్రత్యేకంగా ఫోన్లు చేయించి మరీ మీడియాను షర్మిల ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే.. ‘అన్న వద్దంటే చెల్లి రమ్మంది’.. ఈ ఒక్కసీన్ చాలదా..? షర్మిల-జగన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడానికి అంటూ విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ జయంతి రోజు ఏంటీ బలనిరూపణ..? మీడియాతో ఇలా ఆటలేంటి..? ఇదేమైనా సబబేనా..? అంటూ అటు వైసీపీ.. ఇటు వైఎస్సార్టీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. దీనిపైనే సోషల్ మీడియా వేదికగా శుక్రవారం సాయంత్రం నుంచి సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఇదే చర్చ జరుగుతోంది.

అప్పుడే అయిపోలేదు..!

చూశారుగా వైఎస్ ఫ్యామిలీలో ఇదీ పరిస్థితి. గత కొన్నిరోజులుగా వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పెరుగుతున్నాయే తప్ప ఫుల్‌స్టాప్ పడట్లేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ విభేదాలు ఉన్నప్పటికీ బయటికి ఎక్కడా కనిపించలేదు కానీ.. వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్న వర్సెస్ చెల్లి మీడియా విషయంలో బలనిరూపణ చేసుకున్నారంటే.. రేపొద్దున ఇంకెలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో అని కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇరుపార్టీల నేతలు కంగారుపడుతున్నారట. ఇవన్నీ ఒక ఎత్తయితే శుక్రవారం నాడు ఇడుపులపాయలోని తన ఆస్తులను షర్మిల (Sharmila Assets).. కుమార్తె, కుమారుడి పేరిట పంపకాలు చేయగా.. త్వరలోనే హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా పంచబోతున్నారని.. అప్పుడే ‘జగన్ వర్సెస్ షర్మిల’ అసలు సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!


Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?


Updated Date - 2023-07-08T20:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising