TDP: సోషల్ మీడియా కార్యకర్తలకు టీడీపీ ప్రధాన విజ్ఞప్తి
ABN, Publish Date - Dec 26 , 2023 | 05:02 PM
Telugu Desam Party: ఇటీవల సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటోంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్నాయి. అయితే కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని టీడీపీ గ్రహించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలకు టీడీపీ ప్రధాని విజ్ఞప్తిని చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
ఇటీవల సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటోంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్నాయి. అయితే కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని టీడీపీ గ్రహించింది. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన నాటి నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. కొందరు వైసీపీ కార్యకర్తలు పనిగట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారు. దీంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలకు లాభం చేకూరకపోగా.. నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలకు టీడీపీ ప్రధాని విజ్ఞప్తిని చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
ఎన్నికల నేపథ్యంలో వచ్చే మూడు నెలల పాటు కార్యకర్తలు పార్టీకి పనికొచ్చే విధంగానే పోస్టులు పెట్టాలని టీడీపీ సూచించింది. పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి, వారి విజయాలపైనే ఫోకస్ చేయాలని కోరింది. వైసీపీ నేతల వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు, విధాన నిర్ణయాలలో తప్పులు, అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై సోషల్ మీడియాలో నిలదీయాలని చెప్పింది. తెలంగాణ రాజకీయాలపై (బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సినిమా నటులపై, జనసేన పార్టీపై సంబంధం లేని విషయాలపై స్పందించకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వచ్చే మూడు నెలలు వివాదాల జోలికి పోకుండా ఇంకా ఎక్కువ కష్టపడి పార్టీ విజయంలో ఎవరికి ఎంత సమయం వీలైతే అంత సమయం సద్వినియోగపరిచి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించాలని టీడీపీ పేర్కొంది.
Updated Date - Dec 26 , 2023 | 05:03 PM