ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balakrishna: ‘చిటిక వేస్తే చాలు.. నేను మూడో కన్ను తెరిస్తే’.. వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య మాస్ వార్నింగ్ !

ABN, First Publish Date - 2023-03-15T14:53:55+05:30

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: పల్నాడు జిల్లా (Palnadu District) నరసరావుపేట ఎమ్మెల్యే (Narasaraopet MLA) గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి (Gopireddy Srinivasa Reddy) టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ (Balakrishna Warning) ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు (Balakrishna Song) తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడం సరికాదని, రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టొద్దని బాలకృష్ణ హితవు పలికారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జాగ్రత్త.. హెచ్చరిస్తున్నా.. చిటిక వేస్తే చాలు.. నేను మూడో కన్ను తెరిస్తే’ అని బాలయ్య మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న ఆయన అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.

అసలేం జరిగిందంటే..

‘‘టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాట పెడతావా? ఆయన పాటకు స్టెప్పులేస్తావా? నీకెంత ధైర్యం’’ అంటూ వైసీపీ కార్యకర్తపై ఆ పార్టీ నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కన్నెర్ర చేశారు. తీవ్రస్థాయిలో మందలించి వార్నింగ్‌ ఇచ్చారు. సదరు కార్యకర్త మనస్తాపానికి గురై ఎమ్మెల్యే ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పట్టణంలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను రూపొందించారు. ప్రభ నిర్మాణానికి పార్టీలకతీతంగా భక్తులు విరాళాలు ఇచ్చారు. ప్రభ వద్ద డాన్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్‌ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన గోపిరెడ్డి.. భాస్కరరెడ్డిని మందలించడంతో పాటు హెచ్చరించారని కార్యకర్తలు తెలిపారు.

మనస్తాపానికి గురైన భాస్కరరెడ్డి ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు, కార్యకర్తలు భాస్కరరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు భాస్కరరెడ్డిని ఇంటికి తరలించారు. భాస్కరరెడ్డి తన ఇంటి వద్ద ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. తాను టీడీపీ పాటలు ప్రదర్శించలేదని, సినిమా పాటలే పెట్టానని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. ఎమ్మెల్యే తనను తప్పు పట్టడంవల్లే మనస్తాపం చెందినట్టు వివరించారు.

Updated Date - 2023-03-15T14:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising