TDP: సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ABN, First Publish Date - 2023-03-29T15:51:55+05:30
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అన్నది చారిత్రక అవసరమని ఆ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అన్నది చారిత్రక అవసరమని ఆ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు వ్యాఖ్యానించారు. గల్ప్ దేశాల్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ప్రవాసులైన ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు గల్ఫ్ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. రియాధ్, దమ్మాం మరియు జుబైల్ నగరాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రియాధ్ నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు పాల్గొని ప్రసంగించారు. ‘తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గుర్తింపును తెస్తే.. నారా చంద్రబాబు నాయుడు ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. కార్యకర్తలంతా వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి..’ అని సారధి నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోకూరి దేవ, ముండ్లూరి చలపతిరావు, సుదర్శన్, కిరణ్ కుమార్, కడియాల గౌరయ్య, మంగళగిరి సురేష్, చక్రపాణి, నగరం గుణశేఖర్, చంద్రబాబు, కొడవటి ప్రసాద్ నరసింహారాజు, రామ్మోహన్, కామేశ్వర్, నరసింహం, హేమాద్రి, ఆనంద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-29T15:51:55+05:30 IST