ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Transit Visa: సౌదీ కొత్త ఉచిత వీసా.. పైగా కింగ్‌డమ్‌లో 4రోజులు బస వెసులుబాటు కూడా..

ABN, First Publish Date - 2023-02-01T09:17:19+05:30

సౌదీ అరేబియా (Saudi Arabia) కొత్త ఉచిత ట్రాన్సిట్ వీసాను (Transit Visa) ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియా (Saudi Arabia) కొత్త ఉచిత ట్రాన్సిట్ వీసాను (Transit Visa) ప్రవేశపెట్టింది. ఈ వీసా స్టాప్‌ఓవర్ (Stopovers) ప్రయాణీకులను నాలుగు రోజుల వరకు కింగ్‌డమ్‌లో బస చేయడానికి వీలు కల్పిస్తుంది. జనవరి 30వ తేదీ నుంచి వీసా (సోమవారం) అమలులోకి వచ్చింది. ఈ వీసా కోసం విజిటర్లు సౌదీయా ఎయిర్‌లైన్స్, ఫ్లైనాస్ వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే వీసా ప్రాసెస్ చేయబడుతుంది.

అలాగే ఈ కొత్త సౌదీ వీసా పూర్తి ఉచితం కూడా. వీసా హోల్డర్‌కు కింగ్‌డమ్‌లో నాలుగు రోజుల పాటు బసకు వెసులుబాటు ఉంటుంది. అంతేగాక ఒకసారి జారీ చేసిన వీసా మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. సౌదీ విజన్ 2030 (Saudi Vision 2030) స్ట్రాటజీలో భాగంగా టూరిజంను పెంచేందుకు ఈ కొత్త వీసాను సౌదీ అరేబియా ప్రవేశపెట్టింది. తద్వారా కింగ్‌డమ్‌కు పర్యాటకులను (Tourists) ఆకర్షించి ప్రపంచ పర్యాటక గమ్యస్థానాల్లో విశిష్ట స్థానం పొందాలనేది సౌదీ వ్యూహం. ఇది కింగ్‌డమ్ విజన్ 2030 లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

Updated Date - 2023-02-01T09:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising