ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vistara Flight: విస్తారా విమానంలో ఇటలీ మహిళ రచ్చ రచ్చ చేసిందిగా..!

ABN, First Publish Date - 2023-02-01T07:47:15+05:30

అబూదాబీ నుంచి ముంబై వచ్చిన విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ మహిళ(45) వీరంగం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిట్టి.. కొట్టి.. విమానంలో సిబ్బందిపై ఉమ్మేసి..!

ముంబై, జనవరి 31: అబూదాబీ నుంచి ముంబై వచ్చిన విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ మహిళ(45) వీరంగం సృష్టించింది. ఎకానమీ క్లాస్‌ టికెట్‌ కొని విమానం ఎక్కిన ఆమె బిజినెస్‌ క్లాసులో కూర్చుంటానని పట్టుబట్టింది. అడ్డుకున్న సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించింది. ఒకరిపై ఉమ్మేసింది. మరొకరిని కొట్టింది. విమానంలో మిగతా సిబ్బంది ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆ ప్రయాణికురాలు తన దుస్తులు ఒక్కోటి విప్పేస్తూ విమానంలో సీట్ల మధ్య అటూ ఇటూ తిరగనారంభించింది. సోమవారం ఈ ఘటన జరిగింది. ముంబైలో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే సిబ్బంది ఆ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2023-02-01T07:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising