ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Golden Visa: అబుదాబిలోని గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పదేళ్ల వరకు..

ABN, First Publish Date - 2023-01-17T09:28:59+05:30

యూఏఈ రాజధాని అబుదాబిలోని (Abu Dhabi) గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలోని (Abu Dhabi) గోల్డెన్ వీసాదారులకు గుడ్‌న్యూస్. అన్ని కేటగిరీలకు గోల్డెన్ వీసా (Golden Visa) వ్యవధిని ఐదేళ్ల నుంచి 10ఏళ్లకు పెంచడం జరిగింది. అబుదాబి రెసిడెంట్స్ కార్యాలయంలోని ఆపరేషన్స్ డైరెక్టర్ మార్క్ డోర్జి మాట్లాడుతూ, అబుదాబిలోని అన్ని కేటగిరీలకు గోల్డెన్ వీసా గడువును పదేళ్లకు అప్‌డేట్ చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ వీసాదారులు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, పేరెంట్స్‌కు వయస్సుతో సంబంధం లేకుండా స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గోల్డెన్ వీసా హోల్డర్లు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూఏఈ (UAE) వెలుపల ఉండేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు ఈ నిర్ణయం విస్తృత శ్రేణి లాంగ్‌టర్మ్ రెసిడెన్సీల ఎంపికల కోసం మేలు చేస్తుందని ఈ సందర్భంగా మార్క్ డోర్జి తెలిపారు.

ఇదిలాఉంటే.. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా అనేది ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇస్తోంది.

 

Updated Date - 2023-01-17T09:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising