ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Attack : జ్యూస్‌లో ఇది వేశారంటే.. హార్ట్ అటాక్‌ని కొని తెచ్చుకున్నట్టే..!

ABN, First Publish Date - 2023-02-24T11:44:53+05:30

హార్ట్ అటాక్‌కు కారణాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఒక కారణమని చెప్పలేం. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని మాత్రం చెప్పగలం. ఇక తాజాగా హార్ట్ అటాక్‌కు కారణమయ్యే మరో విషయం ఒకటి వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Heart Attack : హార్ట్ అటాక్‌కు కారణాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఒక కారణమని చెప్పలేం. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని మాత్రం చెప్పగలం. ఇక తాజాగా హార్ట్ అటాక్‌కు కారణమయ్యే మరో విషయం ఒకటి వెలుగు చూసింది. మనం తీసుకునే జ్యూస్‌లో షుగర్ కలిపినా కూడా హార్ట్ అటాక్‌ని కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.

BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలు.. చక్కెర వినియోగాన్ని మొత్తం డైలీ ఎనర్జీలో ఐదు శాతం కంటే తక్కువకు తగ్గించాలని సూచించాయి. అయితే మొత్తం కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి.. హృదయ సంబంధ వ్యాధులకు సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. అయితే వినియోగించే కార్బోహైడ్రేట్ల రకాలు, సోర్సులను పరిశీలిస్తున్నప్పుడు, షుగర్ డ్రింక్స్, పండ్ల రసం, స్వీట్స్ వంటి ఆహారాల నుంచి ఎక్కువ ఫ్రీ షుగర్‌ను తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 5 శాతానికి మించితే.. మొత్తం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఏడు శాతం ఎక్కువగా పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఆరు శాతం ఎక్కువగానూ.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువగా ఉంటుందని బృందం గుర్తించింది.

రోజుకు ఐదు గ్రాముల ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన మొత్తం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 4 శాతం తగ్గుతుంది. ఫ్రీ షుగర్‌ను.. నాన్-ఫ్రీ షుగర్‌తో రీ ప్లేస్ చేయడం వలన హృదయ సంబంధ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ. పండ్లు, కూరగాయలలో సహజంగా లభించేవి.. అలాగే అధిక ఫైబర్ ఉన్నవి తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-24T12:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising