ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Oil Free Chicken Curry: నూనె లేకుండా స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలంటే..!!

ABN, Publish Date - Dec 28 , 2023 | 02:42 PM

నూనె లేకుండా వంట చేయడం సరదాగా అనిపించకపోవచ్చు అందులోనూ చికెన్, మటన్ లాంటి మాంశాహారం తినాలనుకునేప్పుడు మాత్రం నూనె, ఉప్పు, కారం, మసాలాలు తప్పని సరిగా ఉండాల్సిందే.

Oil Free Chicken Curry

నూనె లేకుండా వంట చేయడం సరదాగా అనిపించకపోవచ్చు అందులోనూ చికెన్, మటన్ లాంటి మాంశాహారం తినాలనుకునేప్పుడు మాత్రం నూనె, ఉప్పు, కారం, మసాలాలు తప్పని సరిగా ఉండాల్సిందే. అయితే చికెన్ కూరను నూనె లేకుండా చేయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. నూనె వాడకుండా చికెన్ కూరను ఎలా తయారు చేస్తారనే అనుమానం కూడా రాకపోదు. అయితే నూనె లేకుండా కూడా వంటకాలు నిజానికి చాలా రుచికరమైనవిగా తయారుచేయచ్చు., జీరో ఆయిల్ ఫుడ్ రుచికి రుచి, సులభమైన పద్దతి కూడా. దీనికి ప్రధానంగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే..

నూనె లేని తక్కువ కొవ్వు చికెన్ కర్రీని ఆరోగ్యకరమైన, సులభంగా రుచికరమైన ఆయిల్ ఫ్రీ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలంటే..

400 గ్రాముల చికెన్

1 కప్పు పెరుగు

తాజా క్రీం అరకప్పు

రెండురెమ్మల కరివేపాకు

ఒక టీస్పూన్ కారం

ఒక టీ స్పూన్ ధనియాల పొడి

ఒక టీస్పూన్ జీలకర్ర పొడి

ఒక టీస్పూన్ గరం మసాలా పొడి

ఒకటిన్నర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

తగినంత ఉప్పు..

ఇది కూడా చదవండి: ఇన్ని పోషకాలున్న నెయ్యి తీసుకుంటే నిజంగానే బరువు పెరుగుతారా?


1. ఈ సులభమైన వంటకాన్ని చేయడానికి చికెన్ ముక్కలను కడిగి, శుభ్రం చేసి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నె తీసుకుని చికెన్ ముక్కలును ఉప్పు, మిరియాలు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3. అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, ఉప్పు, మసాలా పొడులతో పాటు పెరుగును కలిపి ఉంచాలి.

4. పైన కలిపి ఉంచిన మిశ్రమాలను చికెన్‌తో కలిపి మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

5. నాన్ స్టిక్ పాన్ లో చిన్న మంట మీద వేడి చేసి అందులో చికెన్ ముక్కలను వేసి తక్కువ మంటమీద ఉంచాలి.

6. చికెన్ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత, ఫ్రెష్ క్రీం వేసి, గ్రేవీ చిక్కగా మారేంత వరకూ కూరను ఉడికించాలి.

7. ఇది అన్నం, రోటీలలోనికి వేడిగా తినేందుకు బావుంటుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 28 , 2023 | 03:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising