ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Union Cabinet: ముగిసిన కేంద్ర కేబినెట్.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

ABN, First Publish Date - 2023-09-18T22:33:45+05:30

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు...

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో.. ఈ తొలి బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచారం.


కాగా.. ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోదీ సమావేశాలకు ప్రారంభం అవ్వడానికి ముందు పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మంత్రివర్గంలో ఏయే నిర్ణయాలు తీసుకున్నారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతీ ఇరానీ, జైశంకర్‌, పీయూష్‌ గోయల్‌, గడ్కరీ, తోమర్‌ పాల్గొన్నారు. ఈ మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని మోదీ.. పీయూష్ గోయల్, ప్రహ్లాద్‌ జోషీ, అమిత్‌ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కేబినెట్ భేటీ నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణలోనే ఈ కేబినెట్ భేటీ జరిగింది.

మరోవైపు.. 5 రోజుల పాటు జరగనున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లో 8 బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితోపాటు ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’, దేశం పేరును మార్చే బిల్లును కూడా తీసుకువస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలావుండగా.. సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 22వ తేదీ వరకు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాలు పాత భవనంలోనే జరగ్గా.. రెండో రోజు అంటే మంగళవారం నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.

Updated Date - 2023-09-18T22:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising