ఇందుకే కదా తల్లి ప్రేమ గొప్పది అనేది.. కొడుకు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి..
ABN, First Publish Date - 2023-06-26T17:26:36+05:30
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొటి లేదు. తల్లి ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు. అదేంటో కానీ తల్లి ప్రేమ గురించి ఎంత మాట్లాడిన కూడా బోర్ కొట్టదు. తల్లి ప్రేమకు సంబంధించిన ఎన్నో వీడియోలను మనం ఇప్పటికే చూసేశాం. తాజాగా అలాంటిదే తల్లి ప్రేమను కళ్లకు కట్టే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొటి లేదు. తల్లి ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి ప్రేమ ముందు ఎంతటి ప్రేమైనా చిన్నదే. ఈ మాటలు మనం పదే పదే వింటూ ఉంటాం. అదేంటో కానీ తల్లి ప్రేమ గురించి ఎంత మాట్లాడిన కూడా బోర్ కొట్టదు. తల్లి ప్రేమకు సంబంధించిన ఎన్నో వీడియోలను మనం ఇప్పటికే చూసేశాం. తాజాగా అలాంటిదే తల్లి ప్రేమను కళ్లకు కట్టే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఎక్కడ జరిగిందో వివరాలు లేవు కానీ, తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూపించే వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం జోరు వర్షంలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కొడుకు సిగ్నల్ వద్ద ఆగారు. ఒక వైపు జోరు వర్షం, మరో వైపు ముందుకు కదలడానికి వీళ్లేకుండా ట్రాఫిక్ జామ్. దీంతో తన కొడుకు వానలో తడవడాన్ని ఆ తల్లి భరించలేకపోయింది. అందుకే గొడుగు లేకపోవడంతో చేతిలో ఉన్న ఓ చిన్న కవర్‌ను కొడుకు తలపై ఉంచి నానకుండా పట్టుకుంది. ఒకవైపు తను నానుతున్నప్పటికీ పట్టించుకోకుండా తన కొడుకును నానకుండా ఉండేలా చూసుకుంటుంది సదరు తల్లి.
దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. రికార్డు స్థాయిలో 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో సదరు వీడియోను చూసిన నెటిజన్లు ఆ తల్లి ప్రేమపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించిన స్వచ్ఛమైనది మరొకటి లేదని కామెంట్ చేస్తున్నారు.
Updated Date - 2023-06-26T17:26:36+05:30 IST