ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. నోటీసులు జారీ చేయలేమంటూ తేల్చేసిన ధర్మాసనం

ABN, First Publish Date - 2023-08-25T19:57:21+05:30

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతపై కేజ్రీవాల్ చేసిన వ్యంగ్యాస్త్రాల మీద గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో...

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతపై కేజ్రీవాల్ చేసిన వ్యంగ్యాస్త్రాల మీద గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో ఆయనకు ఊరట లభించలేదు. ఈ కేసులో తనపై చర్యలు తీసుకోకుండా విచారణపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంలో ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ గుజరాత్‌ హైకోర్టు ఎదుట పెండింగ్‌‌లో ఉందని, దాంతో తాము ఎలాంటి నోటీసుల్ని జారీ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కావాలంటే దీనిపై కేజ్రీవాల్, గుజరాత్‌ యూనివర్సిటీలు.. తమతమ వినతుల్ని హైకోర్టుకు సమర్పించుకోవచ్చని సుప్రీం సూచించింది.


కాగా.. ప్రధాని మోదీ డిగ్రీ అంశంలో గతంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు తమ విశ్వవిద్యాలయానికి పరువుకి నష్టం కలిగించాయని పేర్కొంటూ.. ఆయనపై ఆ గుజరాత్ యూనివర్సిటీ క్రిమినల్ పరువునష్టం కేసు వేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం గుజరాత్‌ మెట్రోపాలిటన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే.. కేజ్రీవాల్ ఈ సమన్లను సవాలు చేస్తూ సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిని సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో.. కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. స్టే ఇవ్వలేమని తీర్పునిస్తూ.. తదుపరి విచారణని వాయిదా వేసింది. ఇంతలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా.. అక్కడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది.

మరోవైపు.. ప్రధాని మోదీకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ వివరాలను కేజ్రీవాల్‌కు ఇవ్వాలంటూ కేంద్ర సమాచాన కమిషన్ ఏడేళ్ల క్రితం ఆదేశాలు ఇవ్వగా, దాన్ని గుజరాత్ హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ప్రధాని సర్టిఫికెట్ కేజ్రీవాల్‌కి చూపించాల్సిన అవసరం లేదని ఈ ఏడాది మార్చిలో పేర్కొంది. ఈ కేసులో సమాచార హక్కు చట్టాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారంటూ ఆయనకు రూ.25 జరిమానా సైతం విధించింది.

Updated Date - 2023-08-25T19:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising