Lt Governor Vs Kejriwal : సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
ABN, First Publish Date - 2023-07-04T12:49:53+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ (DERC) చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని జూలై 11 వరకు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ (DERC) చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని జూలై 11 వరకు వాయిదా వేసింది. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt Governor VK Saxena) కోరకూడదని ఆదేశించింది.
జస్టిస్ ఉమేశ్ కుమార్‌ను డీఈఆర్‌సీ చైర్మన్‌గా జూన్ 21న నియమించారు. కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసింది.
ఇదిలావుండగా, జస్టిస్ కుమార్ చేత డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. అయితే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించవలసి ఢిల్లీ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి అతిషి అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ కార్యక్రమం ఈ నెల 6కు వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ తేదీ జూలై 11 వరకు ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేదు.
ఈ పదవిలో రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంగీత్ రాజ్ లోధాను నియమించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం జూన్ 21న సిఫారసు చేసింది. కానీ అదే రోజు జస్టిస్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి :
Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్
Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో
Updated Date - 2023-07-04T12:49:53+05:30 IST