ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: 'ది కేరళ స్టోరీ' నిషేధంపై మమత సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసు

ABN, First Publish Date - 2023-05-12T16:59:45+05:30

న్యూఢిల్లీ: 'ది కేరళ స్టోరీ' చిత్ర ప్రదర్శనను నిషేధించడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. నిషేధానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. దేశమంతటా సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పశ్చిమబెంగాల్‌లో నిషేధం విధించడానికి కారణం కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) చిత్ర ప్రదర్శనను నిషేధించడంపై పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. నిషేధానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. దేశమంతటా సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పశ్చిమబెంగాల్‌లో నిషేధం విధించడానికి కారణం కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవీ చంద్రచూడ్ (DY Chandrachud), జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పశ్చిమబెంగాల్‌లో చిత్ర పదర్శనను నిలిపివేయడంపై చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.

''దేశంలోని ఏ ఇతర ప్రాంతం కంటే పశ్చిమబెంగాల్ భిన్నం కాదు. అలాంటప్పుడు సినిమా ప్రదర్శించడానికి పశ్చిమబెంగాల్ ఎందుకు అనుమతించడం లేదు?'' అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజలు సినిమా చూడటం ఇష్టం లేకపోతే చూడటం మానిస్తారని పేర్కొంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి హాజరయ్యారు. హింస, విద్వేష ఘటనలు చెలరేగకుండా చూడటం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా ఉండేందుకు 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని నిషేధిస్తున్నట్టు మే 8న మమతా బెనర్జీ ప్రకటించారు.

తమిళనాడు సర్కార్‌కు సైతం...

కాగా, తమిమిళనాడులో 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. ధియేటర్ల వద్ద తీసుకున్న భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై నిషేధం విధించనప్పటికీ, శాంతిభద్రతల కారణాలతో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు తమళనాడులోని ధియేటర్ల యజమానులు ప్రకటించారు.

Updated Date - 2023-05-12T17:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising