RSS : ములాయం, శరద్ యాదవ్‌లకు ఆరెస్సెస్ నివాళులు
ABN, First Publish Date - 2023-03-12T13:21:42+05:30
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆదివారం హర్యానాలోని సమల్ఖలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో దాదాపు వంద మంది
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆదివారం హర్యానాలోని సమల్ఖలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో దాదాపు వంద మంది ప్రముఖులకు నివాళులర్పించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరా బెన్ మోదీ (Hiraben Modi), సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav), సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ (Sharad Yadav), సీనియర్ అడ్వకేట్ శాంతి భూషణ్ తదితరులకు నివాళులర్పించింది. గడచిన సంవత్సరంలో మరణించిన రాజకీయ నేతలు, ప్రముఖులకు శ్రద్ధాంజలి ఘటించడంతో ఈ మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
గత ఏడాది మరణించిన నేతలు, ప్రముఖుల పేర్లను ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే (Dattatreya Hosabale) చదివి వినిపించారు. వీరందరికీ ఆరెస్సెస్ నివాళులర్పించింది. ఈ జాబితాలో సినీ నిర్మాత సతీశ్ కౌశిక్ కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్
Congress Vs BJP : రాహుల్ గాంధీని దేశం నుంచి వెళ్లగొట్టాలి : ప్రజ్ఞ ఠాకూర్
Updated Date - 2023-03-12T13:21:42+05:30 IST