ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Solar Eclipse 2023 : అరుదైన సూర్య గ్రహణాన్ని కనులారా చూసిన ఆస్ట్రేలియన్లు, ఇండోనేషియన్లు

ABN, First Publish Date - 2023-04-20T13:42:48+05:30

అత్యంత అరుదైన సూర్య గ్రహణం చైనా, అమెరికా, మలేసియా, ఫిజీ, కాంబోడియా, జపాన్, సమోవా, సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

Ningaloo Solar Eclipse
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అత్యంత అరుదైన సూర్య గ్రహణం చైనా, అమెరికా, మలేసియా, ఫిజీ, కాంబోడియా, జపాన్, సమోవా, సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, బ్రూనై, సోలోమన్ దీవులు, సౌత్ ఇండియన్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఓషన్, తైవాన్‌లలో కనిపించింది. ఇది అత్యధికంగా సముద్ర ప్రాంతాల్లోనే కనిపించింది. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పశ్చిమ ఆస్ట్రేలియన్లు కేవలం ఒక నిమిషం సేపు మాత్రమే చూడగలిగారు. అదేవిధంగా తిమోర్-లెస్టే ప్రజలకు 1 నిమిషం 14 సెకండ్లపాటు కనిపించింది. ఇండోనేషియన్లు దీనిని 1 నిమిషం 9 సెకండ్లపాటు చూశారు. పాక్షిక సూర్యగ్రహణం ఆగ్నేయాసియా, ఈస్టిండిస్, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్‌వాసులకు కనిపించింది.

ఈ సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించదు. కాబట్టి భారత దేశం నుంచి దీనిని యూట్యూబ్ చానల్ ద్వారా చూశారు. టైమ్ అండ్ డేట్ యూట్యూబ్ చానల్‌లో పెర్త్ అబ్జర్వేటరీ సహకారంతో ఈ దృశ్యాలను ప్రసారం చేశారు. నాసా టెలిస్కోప్ వ్యూస్ గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రసారమయ్యాయి. వీటిని ఆన్‌లైన్‌‌లో చూశారు. ఈ సూర్య గ్రహణం మొదటి చిత్రాలు ఆస్ట్రేలియాలోని ఎక్స్‌మౌత్ నుంచి వచ్చాయి. చంద్రుని ఛాయ సూర్యునిపై పడటంతో ఆకాశంలో చీకట్లు ఆవరించాయి.

ఆస్ట్రేలియాలోని పెర్త్‌, ఎక్స్‌మౌత్‌లో వేలాది మంది ప్రజలు చాలా ఆసక్తిగా ఈ గ్రహణాన్ని వీక్షించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడటం ప్రారంభమవడంతో వీరంతా చాలా ఆసక్తిగా గమనించారు. సూర్యుడిని చంద్రుని ఛాయ పూర్తిగా కప్పివేయడాన్ని ఆశర్యంతో చూశారు. దీనికి నింగలూ గ్రహణం అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కోరల్ బే ప్రాంతంలో చిమ్మచీకట్లు కమ్మినప్పటికీ, సూర్యుడు అర్ధ చంద్రాకారంలో కనిపిస్తూ, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక్కడ సంపూర్ణ సూర్య గ్రహణం 58 సెకండ్లపాటు ఉంది. ఇది ఆకాశంలో వజ్రపుటుంగరం మాదిరిగా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారు.

సంపూర్ణ సూర్య గ్రహణం నుంచి సాధారణ స్థితికి రావడం గురువారం ఉదయం 11 గంటల 26 నిమిషాల 43 సెకండ్లకు ప్రారంభమైంది. చివరికి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల 22 సెకండ్లకు సంపూర్ణ గ్రహణ స్థితి పోయింది. మొత్తం మీద గ్రహణం ఐదు గంటలపాటు ఉంది.

ఇండోనేషియాలోని జకార్తాలో గురువారం ఉదయం 10.33 గంటలకు పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఆకాశంలో మబ్బులు కమ్మినట్లు చీకటి వాతావరణం ఏర్పడింది. ఇక్కడ కూడా సంపూర్ణ సూర్య గ్రహణం 58 సెకండ్లపాటు ఉంది.

మొత్తం మీద ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం ఏప్రిల్ 20 గురువారం ఉదయం 07:04:26 గంటలకు ప్రారంభమైంది, ఉదయం 09:46:53 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరింది, సంపూర్ణ సూర్య గ్రహణం క్షీణించడం ఉదయం 11:26:43 గంటలకు ప్రారంభమైంది, మధ్యాహ్నం 12:19:22 గంటలకు గ్రహణం ముగిసింది.

ఆస్ట్రొనాట్ టిమ్ పీకే ఇచ్చిన ట్వీట్‌లో, తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటనల్లో ఇదొకటని చెప్పారు. 62 సెకండ్లపాటు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేశాడని తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉదయం 11.30 గంటలకు నక్షత్రాలు, గ్రహాలు కనిపించాయన్నారు.

ఇవి కూడా చదవండి :

Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..

Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ అపీలు తిరస్కరణ

Updated Date - 2023-04-20T13:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising