ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: నేను ప్రమాణం చేస్తున్నాను.. బీజేపీకి దిమ్మతిరిగేలా రాహుల్ గాంధీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-10-02T19:51:33+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలను ఇరకాటంలో పడేసే అవకాశాలు వచ్చినప్పుడు.. వాటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాగా వినియోగిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంతో చురుగ్గా..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలను ఇరకాటంలో పడేసే అవకాశాలు వచ్చినప్పుడు.. వాటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాగా వినియోగిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంతో చురుగ్గా రాజకీయ వ్యూహాలను రచిస్తూ.. బీజేపీకి సరైన సమయంలో సరైన రీతిలో కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం కులాల సర్వే వివరాలను విడుదల చేసిన నేపథ్యంలో.. బీజేపీ దిమ్మతిరిగేలా రాహుల్ గాంధీ ఓ కీలక ప్రకటన చేశారు. జనాభా లెక్కల్ని బట్టి తాము హక్కులు అందిస్తామని, ఇది తన ప్రతిజ్ఞ అని హామీ ఇచ్చారు.

సోమవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో నిర్వహించిన కుల గణన ప్రకారం.. ఆ రాష్ట్రంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి మొత్తం 84% మంది ఉన్నట్టు తేలింది. అయితే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 మంది కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందినవారు. వీళ్లు భారతదేశ బడ్జెట్‌లో 5% మాత్రమే నిర్వహిస్తున్నారు. అందుకే, భారతదేశంలోని కుల గణాంకాలకు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నేను ప్రమాణం చేస్తున్నాను.. దేశంలో ఎంత జనాభా ఉంటే, అందుకు తగ్గట్టే మేము ఎక్కువ హక్కులు కల్పిస్తాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. తాము బీజేపీ నేతల తరహాలో కల్లిబొల్లి మాటలు చెప్పమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు.


అలాగే.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సైతం బీజేపీపై విరుచుకుపడ్డారు. బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే ఫలితాలను ఇప్పుడే విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ చొరవని స్వాగతిస్తూ, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో చేసిన ఇలాంటి సర్వేలను గుర్తు చేసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం సైతం త్వరగా జాతీయ కుల గణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజానికి.. యూపీఏ-2 ప్రభుత్వం ఈ జన గణన లెక్కల్ని పూర్తి చేసిందని, కానీ మోదీ ప్రభుత్వం దాని ఫలితాల్ని విడుదల చేయలేదని ఆరోపించారు. సామాజిక సాధికారత కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ లెక్కలు అవసరమన్నారు.

ఇదిలావుండగా.. బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే ప్రకారం వెనుకబడిన (ఓబీసీ), అత్యంత వెనుకబడిన (ఈబీసీ) తరగతుల వారు 63 శాతం ఉన్నట్టు తేలింది. బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల జనాభా ఉండగా, అందులో 36 శాతంతో ఈబీసీ అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. దాని తర్వాత 27.13 శాతంతో ఓబీసీ వర్గం రెండో స్థానంలో ఉంది. ఇక షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, జనరల్ కేటగిరీ వారు 15.52 శాతం, షెడ్యూల్డ్ తెగల వారు 1.68 శాతం ఉన్నట్టు వెల్లడైంది.

Updated Date - 2023-10-02T19:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising