ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi: సిడ్నీ చేరుకున్న ప్రధాని మోదీ, ఘనస్వాగతం పలికిన ఆస్ట్రేలియా హైకమిషనర్, ప్రవాసులు

ABN, First Publish Date - 2023-05-22T20:27:27+05:30

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిడ్నీకి చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) సిడ్నీ(Sydney)కి చేరుకున్నారు. సిడ్నీవిమానాశ్రయం(Sydney Airport)లో ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్(Australian High Commissioner Barry O'Farrell) ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

అనంతరం ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. "భారత్ మాతా కీ జై" "వందేమాతరం" అని నినాదాలు చేశారు. ప్రధాని కోసం వచ్చిన ఓ వృద్ధ మహిళ ‘‘సునో సునో ఏ దునియా వాలో భారత్‌కో బులాయా హై’’ అనే పాటపాడి వినిపించగా ప్రధాని మోదీ ఓపిగ్గా విన్నారు.

ప్రధానిని కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయుల పిల్లల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ వారితో మమేకమై ముచ్చటించారు. వారికి ఆశీస్సులు అందించారు.

ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనిస్తో(Australian Prime Minister Anthony Albanese.)తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఒప్పందంలో భాగంగా ట్రేడింగ్ వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల బలోపేతం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, భద్రత సహకారం సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రటకన విడుదల చేసింది.

ఆస్ట్రేలియాలో పెరుగుతున్న వాణిజ్యం, వృద్ధిని నడపడానికి ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను కూడా కలవనున్నారు. భారతదేశంతో పెట్టుబడులు, ఆస్ట్రేలియా-భారత్ నుంచి అవకాశాలను వారితో చర్చించనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాసుల కమ్యూనిటీ ఉత్సవాల్లో ఇరుదేశాల ప్రధానులు పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. ఢిల్లీలో జరిగే జి-20 సమ్మిట్‌‌లో పాల్గొననున్నారు.

Updated Date - 2023-05-22T20:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising