ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Paresh Rawal:బెంగాలీ వ్యతిరేక వ్యాఖ్యలపై పోలీసు కేసు...హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటుడు

ABN, First Publish Date - 2023-02-01T07:20:52+05:30

బాలీవుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు పరేష్ రావల్ తనపై నమోదైన కేసుపై...

Bollywood actor Paresh Rawal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): బాలీవుడ్ ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు పరేష్ రావల్ తనపై నమోదైన కేసుపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.(Paresh Rawal) పరేష్ రావల్ చేసిన బెంగాలీ వ్యతిరేక వ్యాఖ్యలపై కోల్‌కతా పోలీసులు ఐపీసీ 153, 152 ఎ, 153 బి, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు విచారణ గురువారం(ఫిబ్రవరి 2వతేదీన) జస్టిస్ రాజ్ శేఖర్ మంథా కోర్టులో విచారించనున్నారు. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు పరేష్ రావల్ కు సమన్లు(summoned) పంపించారు.దీంతో పరేష్ రావల్ కోల్‌కతా హైకోర్టును(Calcutta High Court) ఆశ్రయించారు. తాను ఈ కేసులో కోర్టులో హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోర్టును పరేష్ రావల్ కోరారు. ‘‘రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశీయులు మీ చుట్టూ నివశిస్తే గ్యాస్ సిలిండర్లతో బెంగాలీలకు చేపలు వండండి’’(Anti Bengali remark) అంటూ పరేష్ రావల్ గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాలీలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పరేష్ రావల్ ట్విట్టరులో క్షమాపణలు చెప్పారు. తాను చట్టవిరుద్ధమైన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై మాత్రమే వ్యాఖ్యానించానని పరేష్ వివరణ ఇచ్చారు. మొత్తం మీద పరేష్ రావల్ కేసు కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన దీనిపై హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-02-01T07:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising