ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi: 27న తమిళనాడులో ప్రధాని పర్యటన.. ముందుగా రామేశ్వరానికి.. ఆ తరువాత చెన్నైకి

ABN, First Publish Date - 2023-03-16T09:26:17+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఒక్కరోజు పర్యటన కోసం ఈ నెల 27వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఐసిఎఫ్‌(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఒక్కరోజు పర్యటన కోసం ఈ నెల 27వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మదురై రానున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామేశ్వరానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. మళ్లీ హెలికాప్టర్‌లో మదురై(Madurai) చేరుకుని, ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.2,400 కోట్లతో 2.36 లక్షల చ.మీ విస్తీర్ణంలో టెర్మినల్‌ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 2.20 కోట్ల నుంచి 3.50 కోట్ల వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేది జరుగనున్న ఈ టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తదితరులు కూడా పాల్గొననున్నారు.

Updated Date - 2023-03-16T09:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising