ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: స్థానికులను కత్తితో బెదిరిస్తే పోలీసులు ఊరుకుంటారా?.. మరేం చేశారంటే..

ABN, First Publish Date - 2023-02-06T19:59:37+05:30

రద్దీ బజారులో స్థానికులను కత్తితో బెదిరించిన వ్యక్తిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రద్దీ బజారులో స్థానికులను కత్తితో బెదిరించిన వ్యక్తిని పోలీసులు కాల్చిపడేశారు. కర్ణాటక(Karnataka)లోని కలబురగి(Kalburagi)లో జరిగిందీ ఘటన. నల్లని బనియను, ప్యాంటు ధరించిన వ్యక్తి(Miscreant ) కలబురిగి సూపర్ మార్కెట్ ప్రాంతం మధ్యలో నిలబడి స్థానికులకు కత్తి చూపిస్తూ నానా హంగామా చేశాడు. వారిపై దాడికి యత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వారిపైనా కత్తి దూశాడు. దీంతో ఎం జరగబోతోందోనన్న ఉత్సకత అక్కడి వారిలో నెలకొనడంతో వారంతా అక్కడ గుమిగూడారు.

అయినప్పటికీ ఏమాత్రం బెదరని దుండగుడు పోలీసులపైకి కత్తి చూపిస్తూ బెదిరించసాగాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై తుపాకితో కాల్చారు. అతడు ఒక్కసారిగా కుప్పకూలడంతో మరేమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే తమ లాఠీలకు పనిచెప్పారు.

కిందపడిన దుండగుడిపై లాఠీలతో దాడిచేసి చావబాదారు. సూపర్ మార్కెట్ ప్రాంతంలో నిందితుడు కత్తితో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడని, వారిపై దాడికి యత్నించాడని కలబురగి సిటీ పోలీస్ కమిషనర్ చేతన్ ఆర్ తెలిపారు. అతడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అతడు దాడిచేశాడని పేర్కొన్నారు. దీంతో స్వీయరక్షణతోపాటు ప్రజల రక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపినట్టు తెలిపారు.

నిందితుడిని జాఫర్‌గా గుర్తించామని, కాళ్లకు తూటా గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T20:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising