ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmala Sitharaman: వంటగ్యాస్ ధరపై నిర్మలాసీతారామన్‌కు గృహిణుల షాక్

ABN, First Publish Date - 2023-04-03T12:37:37+05:30

కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కు గృహిణులు షాక్ ఇచ్చారు....

Homemakers ask Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాంచీపురం (తమిళనాడు): కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కు గృహిణులు షాక్ ఇచ్చారు.(Homemakers ask Nirmala Sitharaman) 2024 ఎన్నికల ప్రచారం కోసం ‘‘వాల్ టు వాల్’’ ప్రచారాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌తో కలిసి నిర్మలా సీతారామన్ తమిళనాడులోని కాంచీపురం జిల్లా(Tamil Nadu’s Kanchipuram district) పజైయసీవరం గ్రామాన్ని సందర్శించినపుడు గృహిణుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని(Reduce cooking gas price) గృహిణులు నిర్మలా సీతారామన్‌ను డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్...ఐదుగురు మావోయిస్టుల హతం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే గృహిణుల బృందం కేంద్రమంత్రిని చుట్టుముట్టి వంట గ్యాస్ ధర తగ్గించాలని అభ్యర్థించింది.గృహిణుల ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.‘‘మన దేశంలో వంట గ్యాస్ లేదు. కేవలం దిగుమతి చేసుకుంటున్నాం. మనం దిగుమతి చేసుకుంటే, అక్కడ ధర పెరిగితే, ఇక్కడ కూడా పెరుగుతోంది. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతోంది. కానీ గత రెండేళ్లలో పెద్దగా ధర తగ్గలేదు’’ అని కేంద్ర నిర్మలా సీతారామన్‌ గృహిణులకు వివరణ ఇచ్చారు.మొత్తం మీద మహిళలు వంటగ్యాస్ ధరలపై కేంద్రమంత్రిని నిలదీశారు. ఆ తర్వాత ఆమె బీజేపీ కార్యకర్త నివాసానికి వెళ్లి అక్కడ కమలం గుర్తుకు రంగులు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Updated Date - 2023-04-03T12:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising