ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Vijay, BJP: రండి బ్రదర్.. ఎన్నికల్లో కలిసి పనిచేద్దాం

ABN, First Publish Date - 2023-06-24T12:03:27+05:30

ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా కలిసి పనిచేయడానికి ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Vijay)కి ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు నయినార్‌ నాగేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నటుడు విజయ్‌కి బీజేపీ పిలుపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా కలిసి పనిచేయడానికి ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Vijay)కి ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు నయినార్‌ నాగేంద్రన్‌(Nainar Nagendran) పిలుపునిచ్చారు. తిరునల్వేలిలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి విజయ్‌ అని అభిమానులు పోస్టర్లు అతికించడం తప్పుకాదని, రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులేకాక ఎవరైనా రావచ్చునని చెప్పారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఎవరికి ఎంత ప్రజా బలం ఉందో తెలుస్తుందన్నారు. బీజేపీ(BJP)కి మద్దతుగా పనిచేయాలని నటుడు విజయ్‌ని ఆహ్వానిస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు నయినార్‌ నాగేంద్రన్‌ బదులిస్తూ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పనిచేయడానికి నటుడు విజయ్‌తోపాటు అందరినీ ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు చాలినంత ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆరోపించడం గర్హనీయమని, రాష్ట్రంలో 48.90 లక్షల మంది రైతులకు రూ.6వేల చొప్పున ఆర్థికసాయం అందించిందని తెలిపారు. అంతేకాకుండా ఉచిత ఇళ్ల నిర్మాణ పథకం, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు రుణ పథకం, మహిళలకు ఉపాధి పథకం, 59 లక్షల మరుగుదొడ్ల నిర్మాణ పథకం అంటూ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా ముఖ్యమంత్రి కళ్లకు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ముద్ర పథకం కింద రూ.1.32 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసిందన్నారు.

Updated Date - 2023-06-24T12:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising