ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

ABN, First Publish Date - 2023-05-17T09:29:24+05:30

ఆదర్శ నేతలు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటివారిలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్

Anuj Patel, Bhupendra Pael
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఈ రోజుల్లో ఆదర్శ నేతలు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటివారిలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Gujarat Chief Minister Bhupendra Patel) ఒకరు. ఆయన నిరాడంబరతను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ముంబైలో అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని చూడటం కోసం వెళ్లడానికి ఆయన ప్రభుత్వ నిధులు ఖర్చయ్యే చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించుకోలేదు. డొమెస్టిక్ విమానంలోనే ఆయన ప్రయాణం చేసి, ముంబై వెళ్లారు. అంతేకాకుండా అనారోగ్యంత బాధపడుతున్న ఆయన కుమారుడిని అహ్మదాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లిన ఎయిర్ అంబులెన్స్‌కు కూడా డబ్బు చెల్లించారు. కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సైతం ప్రత్యేక హెలికాప్టర్లను వాడే ముఖ్యమంత్రులు ఉన్న ఈ దేశంలో ఇలాంటి నిరాడంబర ముఖ్యమంత్రి కనిపిస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పందిస్తూ, భూపేంద్ర పటేల్‌ను ప్రశంసించారు. మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, నైతికత, నిరాడంబరతలకు అద్భుతమైన ఉదాహరణగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ నిలిచారు. ప్రజా జీవితంలో చురుగ్గా పని చేస్తున్న లక్షలాది మందికి ఆయన ప్రవర్తన ప్రేరణగా నిలుస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. ఆయన కుమారుడు అనూజ్ పటేల్ వేగంగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని తెలిపారు.

భూపేంద్ర పటేల్‌ ఏకైక కుమారుడు అనూజ్ పటేల్‌కు ఏప్రిల్ 30న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అనంతరం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆయనను అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించాలని సలహా ఇచ్చారు. ఆయనను ముంబై తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నారు. అనూజ్ ప్రస్తుతం హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మంగళవారం స్పృహలోకి వచ్చారు. అనూజ్‌ను చూడటానికి భూపేంద్ర ఐదుసార్లు ముంబై వెళ్లారు. ఈ ప్రయాణాలకు ఆయన ప్రభుత్వ నిధులు ఖర్చయ్యే చార్టర్డ్ ఫ్లైట్‌ను ఉపయోగించుకోలేదు. కేవలం డొమెస్టిక్ ఫ్లైట్స్‌లోనే వెళ్లారు.

ఇవి కూడా చదవండి :

ముస్లిం ఉపముఖ్యమంత్రి కావాలి

Jobs: 247 మందికి ఉద్యోగ నియామకాలు.. ఏయే శాఖల్లో అంటే..

Updated Date - 2023-05-17T09:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising