ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashmiri Hindu New Year: ఎల్ఓసీ వద్ద శారదా దేవి విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-03-22T13:22:19+05:30

జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో బుధవారం శారదా దేవి (Goddess Sharada Devi) విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు.

Sharada Devi Temple, Amit Shah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో బుధవారం శారదా దేవి (Goddess Sharada Devi) విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. నియంత్రణ రేఖ (LoC)కి సమీపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని శృంగేరీ మఠం నుంచి తీసుకొచ్చారు.

కుప్వారాలోని టీట్వల్ ప్రాంతంలో శారదా దేవి దేవాలయాన్ని నిర్మించడం 76 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. కశ్మీరీ హిందూ నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఈ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుండటం విశేషం. బుధవారం వసంత నవరాత్రుల ప్రారంభం కూడా అనే విషయం తెలిసిందే. దేశ విభజన జరగడానికి పూర్వం టీట్వల్‌ శారదా దేవి దేవాలయం సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లింది. అప్పట్లో ఉన్న అసలు దేవాలయాన్ని, దానికి సమీపంలోని గురుద్వారాను 1947లో దుండగులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం శారదా దేవి విగ్రహ ప్రతిష్ఠను స్థానిక ముస్లింలు స్వాగతిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతానికి పవిత్ర పుణ్యక్షేత్రం, యాత్రికుల స్థలంగా గుర్తింపు ఉండేదని, ఆ వైభవం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నారు.

శారదా పీఠం అత్యంత పురాతన విద్యా కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడికి భారతీయులు మాత్రమే కాకుండా సెంట్రల్ ఆసియా నుంచి కూడా వచ్చి చదువుకునేవారు. 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు శారదా పీఠం భారత ఉపఖండంలో అత్యంత ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరు పొందింది.

శారదా దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది భక్తులు, పండితులు టీట్వల్ వచ్చారు. కర్ణాటకలోని శృంగేరీ నుంచి దాదాపు 100 మంది పండితులు వచ్చారు.

ఇవి కూడా చదవండి :

Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ

Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా

Updated Date - 2023-03-22T13:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising