Earthquake : యూపీ, హర్యానాలను వణికించిన భూప్రకంపనలు
ABN, First Publish Date - 2023-02-04T07:41:43+05:30
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి...
Earthquake hits UP, Haryana
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి.(Earthquake)పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో(Haryana and western Uttar Pradesh) సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Centre for Seismology) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు పంట సాగు చేస్తున్న షామ్లీ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపం 5కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.
Updated Date - 2023-02-04T07:41:44+05:30 IST