Delhi high court: సీఎం భార్యకు ఊరట.. సిటీ కోర్టు సమన్లపై స్టే
ABN, First Publish Date - 2023-11-06T16:32:45+05:30
రెండు ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ఢిల్లీ సిటీ కోర్టు జారీ చేసిన సమన్లపై హైకోర్టు సోమవారంనాడు 'స్టే' ఇచ్చింది.
న్యూఢిల్లీ: రెండు ఓటర్ ఐడీ కార్డులు (two voter ID cards) కలిగి ఉన్నారనే ఆరోపణల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ (Sunita Kejriwal)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ఢిల్లీ సిటీ కోర్టు జారీ చేసిన సమన్లపై హైకోర్టు (Delhi High Court) సోమవారంనాడు 'స్టే' ఇచ్చింది. తదుపరి విచారణ తేదీ వరకూ ఈ స్టే అమల్లో ఉంటుందని అమిత్ బన్సాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.
రెండు ఓటరు కార్డుల వ్యవహారంలో సునితా కేజ్రీవాల్‌కు తీస్ హజారీ కోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను హైకోర్టులో ఆమె సవాలు చేశారు. సునీతా కేజ్రీవాల్ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఢిల్లీ బీజేపీ సెక్రటరీ హరీష్ ఖురానా చేసిన ఫిర్యాదుపై ఆగస్టు 29న ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని సహిదాబాద్, ఢిల్లీలోని చౌందినీ చౌక్ ఓటర్ల జాబితాలో సునీత పేరు ఉందని పిటిషనర్ ఆరోపణగా ఉంది.
Updated Date - 2023-11-06T16:56:25+05:30 IST