ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP: బీజేపీకి షాకిచ్చిన కీలక నేత.. ఆయన ఎవరంటే..

ABN, First Publish Date - 2023-03-08T10:42:43+05:30

తమిళనాడు బీజేపీ(BJP) అధిష్ఠాన వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు వరుసగా వైదొలుగుతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ ఐటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్యారీస్‌(చెన్నై): తమిళనాడు బీజేపీ(BJP) అధిష్ఠాన వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు వరుసగా వైదొలుగుతున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ ఐటీ సోషల్‌ మీడియా ప్రెసిడెంట్‌ సీటీఆర్‌ నిర్మల్‌కుమార్‌ అన్నాడీఎంకే(AIADMK) తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ సమాచార సాంకేతిక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన దిలీప్‌ కన్నన్‌.... అన్నామలైపై పలు ఆరోపణలు గుప్పించి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. పార్టీ కోసం అలుపెరుగక పనిచేస్తున్న నేతలపై అన్నామలై నిఘా వేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) సమక్షంలో దిలీప్‌కన్నన్‌ మంగళవారం అన్నాడీఎంకేలో చేరారు. రాష్ట్ర బీజేపీలో తగిన గుర్తింపు రాలేదంటూ ఇద్దరు ప్రముఖులు పార్టీ నుంచి వైదొలగడం రాజకీయాల్లో కలకలం ఏర్పరచింది.

Updated Date - 2023-03-08T10:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising