BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్.. అవన్నీ సర్దుకుపోతాయిలేండి..
ABN, First Publish Date - 2023-09-21T10:34:17+05:30
అన్నాడీఎంకే - బీజేపీ మధ్య తలెత్తిన సమస్యలు త్వరలో సర్దుబాటు అవుతాయని ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్(MLA Vanathi Srinivasan)
పెరంబూర్(చెన్నై): అన్నాడీఎంకే - బీజేపీ మధ్య తలెత్తిన సమస్యలు త్వరలో సర్దుబాటు అవుతాయని ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్(MLA Vanathi Srinivasan) తెలిపారు. మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ బుధవారం కోయంబత్తూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఒక్కో పార్టీకి ప్రత్యేక సిద్ధాంతాలు, లక్ష్యాలుంటాయన్నారు. కూటమి సమయంలో పార్టీల మధ్య ఎన్నికలకు సంబంధించిన పొత్తులు మాత్రమే ఉంటాయన్నారు. అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) కూటమి విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ‘ఎన్ మన్..ఎన్ మక్కల్’ పాదయాత్రను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని అన్నారు. కోవైలో పెరియార్ విగ్రహాన్ని అవమానించడాన్ని ఖండిస్తున్నామని, ఏ నేతలను కించపరిచే చర్యలను బీజేపీ అంగీకరించదని వానతి తెలిపారు.
Updated Date - 2023-09-21T10:34:17+05:30 IST