Akhilesh Yadav: అఖిలేష్‌కు ఎస్పీ ఎమ్మెల్యే ఊహించని షాక్
ABN, First Publish Date - 2023-07-15T21:06:04+05:30
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)కు ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ (Dara singh Chauhan) అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ సతీష్ మహనాకు పంపించారు. ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లా ఘోసి నియోజకవర్గానికి దారా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, దారా సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, త్వరలోనే ఆయన బీజేపీ గూటికి తిరిగి చేరనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
దారా సింగ్ గతంలో యోగి అదిత్యనాథ్ ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
Updated Date - 2023-07-15T21:06:04+05:30 IST