ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh : పంజాబ్‌లోనే అమృత్‌పాల్ సింగ్... అతి త్వరలో ఏం చేయబోతున్నాడంటే...

ABN, First Publish Date - 2023-03-29T16:33:20+05:30

ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.

Amritpal Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) త్వరలోనే లొంగిపోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. హోషియార్‌పూర్ మీదుగా అమృత్‌సర్ చేరుకునేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మంగళవారం పంజాబ్ పోలీసులకు తెలిసిందని జాతీయ మీడియా చెప్తోంది. అయితే ఆయన మంగళవారం రాత్రి ఓ చెక్‌పోస్ట్ గుండా ప్రయాణించి, తప్పించుకోగలిగినట్లు కూడా తెలుస్తోంది.

ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన త్వరలోనే పోలీసులకు లొంగిపోతారని సమాచారం రావడంతో స్వర్ణ దేవాలయం, అకల్ తఖ్త్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

హోషియార్‌పూర్ సమీపంలోని ఓ గ్రామంలో పంజాబ్ పోలీసులు మంగళవారం పెద్ద ఎత్తున గాలింపు నిర్వహించారు. ఈ ప్రాంతంలో అమృత్‌పాల్, ఆయన సహచరులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ చర్యలు చేపట్టారు. దీంతో సింగ్, తదితరులు తమ వాహనాన్ని మర్నయన్ గ్రామంలో ఓ గురుద్వారా వద్ద వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు మంగళవారం రాత్రి ఈ గ్రామంలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలించారు. రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఆయన, ఆయన సహచరులు చాకచక్యంగా తప్పించుకోగలిగారు.

అమృత్‌పాల్ సింగ్ సహచరుడొకరిని ఓ కేసులో అజ్నాలా పోలీసులు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆయనను స్టేషన్ నుంచి తీసుకెళ్ళడం కోసం ఆయన, ఆయన సహచరులు ఆ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్నవారందరినీ పట్టుకోవడం కోసం మార్చి 18న పోలీసులు ప్రయత్నించారు. అమృత్‌పాల్ ప్రయాణించిన వాహనాన్ని దాదాపు 50 పోలీసు వాహనాలు వెంబడించాయి. ఆయన జలంధర్‌లో పోలీసుల కళ్లుగప్పి పారిపోగలిగారు. ఆ తర్వాత ఆయన హర్యానా, ఢిల్లీలకు వెళ్లినట్లు సీసీటీవీ విజువల్స్‌ ద్వారా వెల్లడైంది. మరోవైపు అమృత్‌పాల్, ఆయన సహచరుడు పపల్‌ప్రీత్ సింగ్ ఢిల్లీ రోడ్లపై నడుస్తూ తిరుగుతున్నట్లు ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపించారు. వారు కళ్ళజోడు, మాస్క్ ధరించి ఉన్నట్లు కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో వెల్లడికాలేదు. దీనిపై పంజాబ్ పోలీసులు పెదవి విప్పడం లేదు.

ఇవి కూడా చదవండి :

India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!

UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? అమ్మో!

Updated Date - 2023-03-29T16:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising