ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Airplanes: భారీ వర్షంతో విమాన సేవలకు అంతరాయం

ABN, First Publish Date - 2023-11-05T12:18:58+05:30

భారీవర్షాల కారణంగా చెన్నై(Chennai)లో ల్యాండింగ్‌కు అవకాశం లేక నాలుగు విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. చెన్నై, శివారు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): భారీవర్షాల కారణంగా చెన్నై(Chennai)లో ల్యాండింగ్‌కు అవకాశం లేక నాలుగు విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. చెన్నై, శివారు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్టణం(Delhi, Bangalore, Visakhapatnam), అండమాన్‌ ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చిన నాలుగు విమానాలు శనివారం ఉదయం వాతావరణం అనుకూలించక దిగలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ విమానాలు గంటకు పైగా ఆకాశంలోనే చక్కర్లు కొట్టాయి.ఆ తర్వాత సిగ్నలింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చాక విమానాలు వరుసగా సురక్షితంగా ల్యాండింగ్‌ అయ్యాయి.. వర్షం కారణంగా చెన్నై స్వదేశీ, విదేశీ విమానాశ్రయాల్లో రన్‌వేలలో భారీస్థాయిలో నీరు చేరడంతో ఢిల్లీ, పూనే, ముంబై, సిరుగురి, రాజమండ్రి తదితర ఏడు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాయి.

Updated Date - 2023-11-05T12:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising