ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi: విదేశాల్లో మోదీకి అరుదైన గౌరవం, కాళ్లు మొక్కిన పాపువా న్యూ గినియా ప్రధాని

ABN, First Publish Date - 2023-05-21T20:17:22+05:30

విదేశాల్లో భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. విదేశీ పర్యటనలో భాగంగా పాపువా న్యూగినియా దేశం చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే మోదీకి స్వాగతం పలుకుతూ పాదాభివందనం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. విదేశీ పర్యటనలో భాగంగా పాపువా న్యూగినియా దేశం చేరుకున్న మోదీ(PM Modi)కి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే(PM James Marape) మోదీకి స్వాగతం పలుకుతూ పాదాభివందనం చేశారు. మరోవైపు పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు(Indian diaspora) కూడా ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

కాగా పాపువా న్యూగినియాలో పర్యటించిన తొలి ప్రధాని మోదీ. జపాన్‌ పర్యటన విజయవంతమైన తర్వాత, ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా పాపువా న్యూ గినియాకు చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

జపాన్‌లోని హిరోషిమాలో నిర్వహించిన జీ-7 శిఖరాగ్ర సదస్సు(G-7 Summit)లో పాల్గొన్న అనంతరం ఆదివారం ప్రధాని మోదీ పాపువా న్యూగినియా చేరుకున్నారు. సోమవారం జరిగే ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి జేమ్స్ మరాపేతో కలిసి ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో 14 పసిఫిక్ ద్వీప దేశాలు పాల్గొననున్నాయి.

Updated Date - 2023-05-21T20:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising