ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel Hamas War: ఇజ్రాయెల్‌కు ఊహించని ఝలక్.. చమురు, ఆహార ఎగుమతుల్ని ఆపేయాలంటూ ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు

ABN, First Publish Date - 2023-11-01T17:59:05+05:30

హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్ని ఇరాన్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్ని ఆపేయాల్సిందిగా ఆ ముస్లిం దేశం ఇజ్రాయెల్‌ని డిమాండ్ చేస్తూ...

హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్ని ఇరాన్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్ని ఆపేయాల్సిందిగా ఆ ముస్లిం దేశం ఇజ్రాయెల్‌ని డిమాండ్ చేస్తూ వస్తోంది. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఇరాన్ గళమెత్తింది. పాలస్తీనియులపై అన్యాయంగా పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను ఒంటరి చేయాలని, ఆ దేశానికి నిత్యవసర ఎగుమతుల్ని నిలిపివేయాలని ముస్లిం దేశాలకు (ఓఐసీ - ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్) ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు.


‘‘గాజాలో జరుగుతున్న బాంబు దాడులు తక్షణమే ఆపేయాలి. ఇందుకోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా ముస్లిం దేశాలన్ని చమురు, ఆహార ఎగుమతుల్ని నిలిపివేయాలి’’ అని ఖమేనీ ఒక ప్రసంగంలో పేర్కొన్నట్టు ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇలాంటి అభ్యర్థనలను చాలా చేసింది. ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని, ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని కోరుతోంది. కొన్ని దేశాలు ఇరాన్ మాటకు కట్టుబడి ఉంటే, మరికొన్ని మాత్రం ఇప్పటికీ తమ వైఖరి వెల్లడించకుండా మౌనం పాటిస్తున్నాయి. మరోవైపు.. హమాస్‌తో హిజ్బుల్లాకు ఇరాన్ రహస్యంగా నిధులతో పాటు ఆయుధాల సహకారం అందిస్తోందని ఇరాన్‌పై విమర్శలు ఉన్నాయి.

ఇదిలావుండగా.. గాజాలో సామాన్య పౌరులు మరణిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధానికి కనీసం తాత్కాలికంగా బ్రేక్ (సీజ్‌పైర్) ప్రకటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఫలితంగా.. అక్కడి పౌరులను మానవతా సహాయం అందించడంతో పాటు రక్షించడానికి వీలు దొరుకుతుందని పేర్కొంటున్నాయి. అటు.. అరబ్ దేశాల నుంచి కూడా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగోతంది. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాట వినకుండా దాడుల్ని ముమ్మరం చేస్తూనే ఉంది. గెలుపొందే వరకూ వెనక్కు తగ్గేదే లేదంటూ ప్రతిజ్ఞ చేసింది. కాగా.. తొలుత హమాస్ చేసిన దాడిలో ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా, అందుకు ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో గాజాలో వేలాదిమంది మృతి చెందుతున్నారు.

Updated Date - 2023-11-01T17:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising