ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Turkey Earthquakes: 24 గంటల్లో 3 శక్తివంతమైన భూకంపాలు.. 2300 మంది కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-06T20:38:37+05:30

వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మృతుల సంఖ్య 2300 దాటిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ..

అంకారా: వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. దీంతో మృతుల సంఖ్య 2300 దాటిపోయింది. భూకంపాల తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య 5 వేలకు పైనే ఉండొచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.24 గంటలకు రెండోసారి 7.5 తీవ్రతతో, ఆ తర్వాత కొద్దిసేపటికే 6.0 తీవ్రతతో మూడోసారి భూకంపాలు కకావికలం చేశాయి.

సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మృతుల వివరాలు వెంటనే తెలియలేదు. టర్కీలో భౌగోళిక పరిస్థితుల రీత్యా తరచు భూకంపలు సంభవిస్తుంటారు. టర్కీలో గత మూడేళ్లలో 18 మంది భూకంపాల కారణంగా మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈశాన్య టర్కీలో 1999లో సంభవించిన భారీ భూకంపంలో 17,000 మందికి పైగా మరణించారు.

Updated Date - 2023-02-06T21:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising