ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ebola Like Virus: ఈక్వటోరియల్ గినియాలో ఎబోలా కొత్త వైరస్...9 మంది మృతి

ABN, First Publish Date - 2023-02-14T07:30:34+05:30

ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలా కొత్త వైరస్ ప్రబలింది...

Ebola-Like Virus
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలబో: ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలా కొత్త వైరస్ ప్రబలింది. ఎబోలా లాంటి కొత్త వైరస్ వల్ల 9మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. (Ebola-Like Virus)చాలా ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ వల్ల జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం అవుతోంది. శరీర సామర్థ్యాన్ని తగ్గించే ఈ వైరస్ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వైద్య బృందాలను ఆ దేశానికి పంపించింది.ఎబోలా కొత్త వైరస్ సోకిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు,విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. ప్రాణాంతకమైన ఈ కొత్త వైరస్ సోకిన ప్రావిన్సును క్వారంటైన్ చేశామని ఈక్వటోరియల్ గినియా(Equatorial Guinea) ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు వెలుగుచూసినట్లు ప్రభుత్వం గత వారం ప్రకటించింది.కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్,పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య హెచ్చరిక(Health alert) ప్రకటించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మితోహా ఒండో అయేకాబా విలేకరుల సమావేశంలో చెప్పారు.

కీ-ఎన్‌టెమ్‌లో ఈ వైరస్ 4,325 మందిని ప్రభావితం చేసిందని మంత్రి చెప్పారు.జనవరి 7 ఫిబ్రవరి 7 తేదీల మధ్య ఈ వైరస్ వల్ల 9 మంది మరణించారు. ఆఫ్రికాలో గతంలో ప్రబలిన ఎబోలాతో చాలామంది మరణించారు.ఎబోలా కొత్త వైరస్ ప్రబలుతుండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(World Health Organization) హైఅలర్ట్(High alert) ప్రకటించింది.

Updated Date - 2023-02-14T08:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising