Home » Ebola
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఎబోలా అలజడి సృష్టిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఎబోలా కేసుల సంఖ్య 550కి చేరింది. వీరిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది.
ఈనెల 23న ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ మహిళ చేరుకున్నారు. ఒళ్లునొప్పులు, అలసట వంటి ఎబోలా లక్షణాలను ఆమెలో ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించారు.
ఎబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.
దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలా కొత్త వైరస్ ప్రబలింది...