Share News

ఎబోలా ముప్పు.. ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేంద్రం

ABN , Publish Date - May 25 , 2026 | 06:01 PM

ఎబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.

ఎబోలా ముప్పు.. ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేంద్రం
Ebola Alert In India

ఇంటర్నెట్ డెస్క్: ఎబోలా వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తాజాగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. జ్వరం, వాంతులు, అకారణ రక్తస్రావం, తలనొప్పి, వంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఎయిర్‌‌పోర్టు హెల్త్ ఆఫీసర్‌కు ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌కు ముందే వెల్లడించాలని స్పష్టం చేసింది. ఎబోలా కేసులు అధికంగా ఉన్న డీఆర్‌సీ, ఉగాండా, దక్షిణ సుడాన్‌కు వెళ్లవద్దని కేంద్రం ఇప్పటికే భారతీయులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. లెబొరేటరీలు, క్వారంటైన్ వసతులను ఏర్పాటు చేస్తున్నారు.


మరోవైపు, ఆఫ్రికాలో ఇప్పటివరకూ 900లకు పైగా ఎబోలా అనుమానిత కేసులు వెలుగు చూశాయని డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా వెల్లడించింది. 101 కేసుల్లో ఇప్పటికే వ్యాధి నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. ఇక యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న డీఆర్‌సీ దేశంలో 904 అనుమానిత కేసులు వెలుగులోకి రాగా 101 మంది రోగుల్లో ఎబోలా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 119 మంది ఎబోలా వల్లే మరణించినట్టు అనుమానాలు ఉన్నాయి. మరో 10 కేసుల్లో ఎబోలా వల్లే మరణాలు సంభించిందని కూడా పరీక్షల్లో తేలింది. మే 24 వరకూ ఉన్న వివరాల ప్రకారం, ఉగాండాలో 5 నిర్ధారిత కేసులు, ఒక ఎబోలా మరణం వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికా దేశాల్లో జాతీయ స్థాయిలో ఎబోలా వ్యాప్తి చెందే రిస్క్ ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రపంచస్థాయి వ్యాప్తి ముప్పు కొంత తక్కువగా ఉందని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం

కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్

Updated Date - May 25 , 2026 | 06:09 PM