రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
ABN , Publish Date - May 25 , 2026 | 05:58 PM
దేశ రాజధాని ఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం 131 మందికి ఈ అవార్డులు దక్కగా.. అందులో ముగ్గురు తెలంగాణ వాసులుండటం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం.. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా.. వారిలో ఐదుగురు పద్మవిభూషణ్, 13 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాల్ని అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ.. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
బహిరంగ నమాజ్, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు
ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు