ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Organ donation: అవయవదానం గురించి ఈ విషయాలు తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-08-08T11:54:19+05:30

అవయవ దానం ఎంతో గొప్ప దానం. కానీ దీని పట్ల ప్రజల్లో అవగాహన తక్కువ. కాబట్టి అవయవ దానం పట్ల అవగాహన ఏర్పరుచుకుందాం!

అవయవ దానం ఎంతో గొప్ప దానం. కానీ దీని పట్ల ప్రజల్లో అవగాహన తక్కువ. కాబట్టి అవయవ దానం పట్ల అవగాహన ఏర్పరుచుకుందాం!

అవయవాలు విఫలమైన సందర్భాల్లో, వాటిని చికిత్సతో చక్కదిద్దే ప్రయత్నాలు విఫలమైనప్పుడు, రోగి పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఇతర వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించి, రోగి శరీరంలో ప్రవేశ పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, పూర్తిగా నిర్జీవ స్థితికి చేరుకున్న వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం... ఇలా అవయవ దానాలు మూడు రకాలుగా ఉంటాయి. వీటిలో బ్రెయిన్‌ డెత్‌కు గురైన వ్యక్తికి సంబంధించిన అవయవదానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

తీవ్రమైన రోడ్డు ప్రమాదాల్లో, లేదా తీవ్రమైన అనారోగ్యాల్లో రోగుల్లో అనూహ్యంగా బ్రెయిన్‌ డెత్‌ పరిస్థితి తలెత్తుతుంది. రోగి మరణం అనివార్యమైన సందర్భాల్లో ఒక్కో అవయవం పని చేయడం మానేస్తూ ఉంటుంది. మెదడు స్తంభించినపోయినప్పటికీ, మిగతా ప్రధాన అవయవాలు కొంత సేపటివరకూ చైతన్యంగానే ఉంటాయి. కాబట్టి నిపుణులైన వైద్య బృందం సదరు వ్యక్తి బ్రెయిన్‌ డెత్‌కు గురైనట్టు నిర్థారించిన తర్వాత, ఆ వ్యక్తికి చెందిన కీలకమైన అవయవాలను కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించవచ్చు. అయితే ఆప్తులు చనిపోయిన దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించవలసి ఉంటుంది. వాళ్లు రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే అవయవాలను సేకరించడం జరుగుతుంది. అవయవ దానం సంక్లిష్టమైన ప్రక్రియ. చైతన్యవంతంగా ఉన్న నిర్దిష్టమైన అవయవాన్ని ఎంతో నేర్పుగా సేకరించి, నిపుణులతో కూడిన వైద్య బృందం సహాయంతో అంతే చైతన్యవంతంగా రోగిలో ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇలా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయాలను సేకరించి, ఇతరులకు దానం చేయవచ్చు.

కాలేయ మార్పిడి

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, మద్యపానం, డ్రగ్స్‌, కేన్సర్‌, పుట్టుకతో వెంట తెచ్చుకునే వ్యాధుల వల్ల కాలేయం పని చేయని స్థితికి చేరుకున్నప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఈ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలుంటాయి.

మృత దాత లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌: మెదడు పనిచేయడం ఆగిపోయిన రోగుల్లో మిగతా ప్రధాన అవయవాలు కొద్ది సేపటి వరకూ పని చేస్తూనే ఉంటాయి. స్ట్రోక్‌, ట్రామా వల్ల మెదడు పనితీరు ఆగిపోయినప్పుడు, 48 నుంచి 72 గంటల్లోగా మిగతా అవయవాలు కూడా స్తంభించిపోతాయి. ఆ వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం కోసం, కుటుంబంలోని కీలకమైన వ్యక్తి అనుమతి తీసుకోవడంతో పాటు, ఇద్దరు న్యూరాలజిస్టులు ధృవపత్రం ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత దేహానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు.

హృదయ స్పందన లేని డోనార్లు: పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించే పద్ధతి ఇది. చనిపోయిన 20 నమిషాల లోపే అవయవాన్ని సేకరించాలి. తర్వాత భద్రపరిచి, సాధికారిక వ్యక్తుల సమ్మతితో, చట్టపరమైన విధానాల ద్వారా ఆ అవయవాన్ని సేకరించవచ్చు.

సన్నిహితుల నుంచి సేకరించడం: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి కూడా అవయవాన్ని సేకరించవచ్చు. ఈ ఆపరేషన్లను వీలైనంత తక్కువ సంక్లిష్టతతోనే చేయగలుగుతున్నారు. కాలేయాన్ని దానం చేసిన వ్యక్తిలో కొన్ని నెలల వ్యవధిలోనే కాలేయం పూర్తి పరిమాణానికి పెరిగిపోతుంది. కొన్ని వారాల వ్యవధిలోనే స్వీకర్త తన పనులన్నిటినీ చేసుకోగలుగుతాడు.

కాలేయాన్ని సేకరించి, రిసీవర్‌ శరీరంలోకి ప్రవేశపెట్టడం నిపుణులైన వైద్య బృందం మాత్రమే చేయగలుగుతుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు, సదరు ఆస్పత్రిలో అన్ని వసతులూ ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, బ్లడ్‌ బ్యాంక్‌, సపోర్టివ్‌ ల్యాబ్‌లు ఉండాలి. సుశిక్షితులైన సిబ్బంది ఉండాలి. వీటన్నిటినీ బట్టి కాలేయ మార్పిడి ఖర్చుతో కూడుకున్న సర్జరీ అనుకోవలసిన అవసరం లేదు. మన దేశంలో ఈ సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువే! ఈ కొత్త అవయం స్వీకర్త శరీరం స్వీకరించడమే కీలకమైన విషయం. కొన్ని శరీరాలు అవయవాన్ని రిజెక్ట్‌ చేయవచ్చు. అందువల్ల రోగిని కొంత కాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచవలసి ఉంటుంది. అంతిమంగా రోగి కొత్త అవయవంతో కోలుకోగలుగుతాడు.

-డాక్టర్‌ ఆర్‌.వి. రాఘవేంద్ర రావు,

సీనియర్‌ కన్సల్టెంట్‌ సర్జికల్

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

డైరెక్టర్‌, రెనోవా హాస్పిటల్స్‌, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-08-08T11:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising