ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Care: జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

ABN, First Publish Date - 2023-11-23T13:10:05+05:30

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి...

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి...

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను కలపాలి. బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్‌ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్‌ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే జుట్టులో కాంతి వస్తుంది.

  • సగం అరటిపండును గుజ్జుగా చేసి బౌల్‌లో తీసుకోవాలి. అందులో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం తగ్గుతుంది.

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, మరో టేబుల్‌ స్పూన్‌ అలొవెరా జెల్‌ను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కుదుళ్లలో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఇదో చక్కని కండీషనర్‌లా పని చేస్తుంది. చుండ్రు సమస్యలు ఇట్టే మాయమవుతాయి.

  • కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, టేబుల్‌ స్పూన్‌ అలొవెరాజెల్‌ కలపాలి. ఈ మిశ్రమంతో హెయిర్‌ మాస్క్‌ వేస్తే.. జుట్టు గట్టిగా తయారవుతుంది.

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Updated Date - 2023-11-23T13:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising