ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indigestion: తిన్న ఆహారం అరగకపోవడం వల్ల కడుపులో మంట.. గ్యాస్ సమస్యతో పడలేకపోతుంటే ఈ ఒక్కటి చేయండి చాలు..!

ABN, First Publish Date - 2023-04-01T11:04:09+05:30

తిన్న ఆహారం అరగకపోతే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. తద్వారా కడుపులోనూ.. ఛాతిలోనూ మంట మొదలవుతుంది. మరి దీని నుంచి బయపడటం ఎలా? ఈ సమస్యకు ఇంట్లో దొరికే వస్తువులతో చెక్ పెట్టేయవచ్చా? లేదంటే దీని కోసం కూడా మెడికల్ షాపునకు పరిగెత్తాలా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిన్న ఆహారం అరగకపోతే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. తద్వారా కడుపులోనూ.. ఛాతిలోనూ మంట మొదలవుతుంది. మరి దీని నుంచి బయపడటం ఎలా? ఈ సమస్యకు ఇంట్లో దొరికే వస్తువులతో చెక్ పెట్టేయవచ్చా? లేదంటే దీని కోసం కూడా మెడికల్ షాపునకు పరిగెత్తాలా? అంటే వంటింటి చిట్కాలు సరిపోతాయి అనడం కన్నా అద్భుతంగా పనిచేస్తాయనడం మేలేమో. ముఖ్యంగా మన ఆహార అలవాట్లు లేదా జీవనశైలి కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. వీటికి మన వంటింట్లో ఉండే ఇంగువ, వాముతో చెక్ పెట్టేయవచ్చు.

ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియ మెరుగుపడటానికి ఇంగువ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక భారతీయ వంటకాలలో ఇంగువను సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. ఇంగువలో ఉండే యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఇంగువను నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా, వేగవంతమవుతుంది.

వాముతో ఆరోగ్య ప్రయోజనాలు..

వాములో ఉండే థైమోల్ కడుపులో గ్యాస్ట్రిక్ రసాన్ని విడుదల చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంగువ, వాము కలిసి అజీర్ణం, ఆమ్లత్వానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తాయి. అందుకే ఇంగువ, వాము నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇంగువ, వాము కలిపిన వాటర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

ఇంగువ, వాము కలిపి నీటిలో నానబెడితే వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి వచ్చేస్తాయి. ఇక ఆ నీటిని తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజ్వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీ శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు మరియు ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా ఇంగువ, వాము నీరు ఉపయోగపడతాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమై బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఇంగువ, వాము వాటర్ ఎలా తయారు చేసుకుంటే ప్రయోజనం?

ఇంగువ, వాము నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక పాన్‌లో ఒక గ్లాసు నీరు తీసుకుని, వాటిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. ఇక ఆ నీటిలో నాలుగో వంతు ఇంగువ.. నల్ల ఉప్పు వేసి బాగా కలపి దానిని తీసుకోండి.

Updated Date - 2023-04-01T11:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising