ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు.. కండిషన్ అప్లై!

ABN, First Publish Date - 2023-03-04T13:00:01+05:30

తాడేపల్లి (Tadepalli)లోని ఆంధ్రప్రదేశ్‌ (AP) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) - అయిదోతరగతి (ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

కండిషన్ అప్లై!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాడేపల్లి (Tadepalli)లోని ఆంధ్రప్రదేశ్‌ (AP) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) - అయిదోతరగతి (ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఆర్‌ఏజీ-ఫిఫ్త్‌ సెట్‌ (ప్రవేశ పరీక్ష)2023 ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా జిల్లాలవారీగా ఉన్న డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ (Ambedkar) గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు సొంత జిల్లా గురుకులంలో ప్రవేశానికి మాత్రమే అప్లయ్‌ చేసుకోవాలి. విద్యార్థులు తాము చేరదలచుకొన్న గురుకుల పాఠశాల వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరవాత మార్పులకు అవకాశం లేదు.

అర్హత: ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2021-22 సంవత్సరంలో మూడోతరగతి పూర్తిచేసి 2022-23 సంవత్సరంలో(ప్రస్తుతం) నాలుగోతరగతి చదువుతున్న బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించరాదు.

వయసు: జనరల్‌, బీసీ, కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌ విద్యార్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2010 సెప్టెంబరు 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.

రిజర్వేషన్‌ వివరాలు

  • ఎస్సీ విద్యార్థులకు 75 శాతం, బీసీ-సీ(కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌) విద్యార్థులకు 12 శాతం, ఎస్టీ విద్యార్థులకు 6 శాతం, బీసీ విద్యార్థులకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు ప్రత్యేకించారు.

  • కర్మాగారాల్లో పని నుంచి తీసేసిన పిల్లలు, అనాథలు, సైనికోద్యోగుల పిల్లలకు 15 శాతం; వికలాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు. వీరు సంబంధిత సర్టిఫికెట్‌ను దరఖాస్తుకు జతచేయాలి

  • ప్రతి కేటగిరీలో 3 శాతం సీట్లను సఫాయి కర్మచారి విద్యార్థులకు ప్రత్యేకించారు.

  • ఏదైనా కేటగిరీలో సీట్లు మిగిలితే వాటిని ఎస్సీ విద్యార్థులకు కేటాయిస్తారు.

బీఆర్‌ఏజీ-ఫిఫ్త్‌ సెట్‌ వివరాలు: పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్టులనుంచి ఒక్కోదానిలో 10; మేథమెటిక్స్‌, ఈవీఎస్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 15 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్దేశించిన నాలుగోతరగతి సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద బ్లూ/ బ్లాక్‌ పెన్‌తో గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు నిర్దేశించారు. మొత్తం మార్కులు 50. నెగెటివ్‌ మార్కులు లేవు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు లేదు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 24

బీఆర్‌ఏజీ-ఫిఫ్త్‌ సెట్‌(ప్రవేశ పరీక్ష) తేదీ: ఏప్రిల్‌ 23

వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

Updated Date - 2023-03-04T13:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!