ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెపై కన్నతండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి.. కేరళ కోర్టు సంచలన తీర్పు

ABN, First Publish Date - 2023-01-31T17:30:52+05:30

కన్న కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన తండ్రికి మూడు జీవిత ఖైదులు విధిస్తూ కేరళ కోర్టు(Keral Court)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కన్న కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన తండ్రికి మూడు జీవిత ఖైదులు విధిస్తూ కేరళ కోర్టు(Keral Court) సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని మళప్పురం(Malappuram)లో జరిగిందీ ఘటన. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..

మార్చి 2021లో 15 ఏళ్లున్న బాలిక కరోనా(Covid-19 నేపథ్యంలో ఇంటి నుంచే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతోంది. కుమార్తెపైనే కన్నేసిన తండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బెడ్రూములోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చంపేస్తానని బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

మదర్సాలో టీచర్‌గా పనిచేసిన తండ్రి విచక్షణ మర్చిపోయి ఆ ఏడాది అక్టోబరు వరకు పలుమార్లు కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో బాలిక మళ్లీ స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పొట్టలో నొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఏమీ లేదని, భయపడాల్సిన పనిలేదని కొన్ని మందులు ఇచ్చి పంపించారు.

అయితే, జనవరి 2022లో మరోమారు ఆమె కడుపు నొప్పితో బాధపడడంతో ఈసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి విస్తుపోయే విషయం చెప్పారు. బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో తల్లి, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత బాలిక తండ్రిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు, బాలిక పిండం, ఆమె తండ్రి డీఎన్‌ఏ నమూనాలను సేకరించిన పోలీసులు పరీక్షలకు పంపగా అక్కడ అసలు నిజం బయటపడింది. బాలిక గర్భం దాల్చడానికి తండ్రే కారణమని తేలింది.

కేసును విచారించిన మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడిని దోషిగా తేల్చి మూడు జీవిత ఖైదులు విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే, రూ. 6.6 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజేశ్ కె తీర్పు చెప్పారు.

Updated Date - 2023-01-31T17:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising