YCP Minister Roja: పవన్ కళ్యాణ్ నిజంగా హీరో అని భావిస్తే.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేయాలి
ABN, First Publish Date - 2023-07-14T19:15:43+05:30
పవన్ కళ్యాణ్ నిజంగా హీరో అని భావిస్తే.. 175 స్థానాలు సింగిల్‌గా పోటీ చేయాలి.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆర్కే రోజా (YCP Minister Roja) పామర్రులో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"పవన్ కళ్యాణ్ నిజంగా హీరో అని భావిస్తే.. 175 స్థానాలు సింగిల్‌గా పోటీ చేయాలి. చంద్రబాబు ఆవహించిన చంద్రముఖి పవన్ కళ్యాణ్. ఆయన బతుకు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నాడు కుటుంబాన్ని తిట్టాడని ఏడ్చిన పవన్ కళ్యాణ్. నేడు అదే చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నాడు. గన్నులు పట్టుకొని రోడ్లపై తిరిగిన పవన్ కళ్యాణ్ కంటే పెద్ద రౌడీ ఎవరూ లేరు. లోకజ్ఞానం తెలియని పిల్లలే పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడులకు తందాన అంటున్నారు. చంద్రబాబు పార్టనర్ సింగపూర్ రవాణా మంత్రి అవినీతిపై అక్కడ ప్రభుత్వం విచారణ చేస్తుంది. త్వరలో సింగపూర్ పోలీసులు రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తీసుకెళ్తారు. చట్టబద్ధంగానే పంచాయితీలకు అనుగుణంగా సచివాలయ, వాలంటరీ వ్యవస్థను తెచ్చాం. అవగాహన లేమితో కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో కమీడియన్ అయిన పవన్ కళ్యాణ్‌కు ప్రజా సమస్య గురించి ఏం తెలుస్తుందని మండిపడ్డారు." అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-07-14T19:23:16+05:30 IST