ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjala Ramakrishna Reddy: వివేకా హత్యకు మోటివ్ వేరే ఉంది

ABN, First Publish Date - 2023-05-31T15:54:32+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీలో పెద్ద దిక్కులా పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి ని లొంగదీసుకొని పచ్చ ముఠా తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Former Minister YS Vivekananda Reddy) వైసీపీలో (YCP) పెద్ద దిక్కులా పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (YCP Leader Sajjala Ramakrishna Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరిని లొంగదీసుకొని పచ్చ ముఠా తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. సీబీఐ (CBI) అరెస్ట్ చేస్తుంది వేధించడానికి, జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించడానికి అని మండిపడ్డారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) పెట్టిన పార్టీ అని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి కాంగ్రెస్‌‌లో ఉన్నారని.. ఆ తరువాత వివేకానంద రెడ్డి వైసీపీలోకి వచ్చారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి కూడా కుటుంబ పెద్దగా వివేకానంద రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే జగన్ తన పార్టీ ప్రతినిధిగా పులివెందులలో అవినాష్ రెడ్డిని పెట్టారని ఆయన గుర్తుచేశారు.

వివేకా హత్యకు పొలిటికల్ అజెండా కారణం అనడానికి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వివేకా హత్యకు మోటివ్ వేరే ఉందని.. సాక్షాలను చేరిపేశారు అని అనడానికి అవకాశం లేదని తెలిపారు. వివేకా హత్య కేసులో అసలైన సాక్ష్యం వివేకా రాసిన లెటర్.. దానిపై సీబీఐ దృష్టి పెట్టడం లేదని అన్నారు. టీడీపీ చెప్పిన లైన్‌లో సీబీఐ విచారణ చేయడం దురదృష్టమన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. వివేకా కూతురు చేసిన కార్యక్రమాలు ఇవాళ కాకపోతే రేపు అయినా బయటకు రాక తప్పదని అన్నారు. జగన్ ఢిల్లీ వెళితే కోర్టులను ప్రభావితం చేయగలరా.. ఇది కోర్టులను కించపర్చడం కాదా అని నిలదీశారు. తన తండ్రిని ఓడించిన వారితో సునీత కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. సునీతకు రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి ఉందన్నారు. దస్తగిరి వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ప్రజలకు మంచి చేయడం టీడీపీ దృష్టిలో నేరాలు, ఘోరాలు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-05-31T15:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising