Harsh Kumar: గవర్నర్‌ను కలిసిన మాజీ ఎంపీ హర్షకుమార్
ABN, First Publish Date - 2023-12-01T13:45:00+05:30
విజయవాడ: మాజీ ఎంపీ హర్షకుమార్ శుక్రవారం ఏపీ గవర్నర్‌ను రాజ్ భవన్‌లో కలిసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతోందని, సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
విజయవాడ: మాజీ ఎంపీ హర్షకుమార్ శుక్రవారం ఏపీ గవర్నర్‌ను రాజ్ భవన్‌లో కలిసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతోందని, సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సభ్ నిధులు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేశామని చెప్పడం ఎంటని ప్రశ్నించారు. అమ్మఒడికి కూడా సబ్ ప్లాన్ నిధులే మళ్లిస్తున్నారని ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు నిధులు కేటాయించడం లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు పూర్తిగా నష్ట పోతున్నారని, వైఎస్ఆర్ వచ్చే వరకు స్కాలర్‌షిప్ అంటే ఏంటో ప్రభుత్వాలకు తెలీదని హర్షకుమార్ అన్నారు. కానీ అదే స్కాలర్‌షిప్‌ను ఈరోజు పక్కన పెట్టేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని, ఏపీలో మెడికల్ కాలేజీల్లో సీట్లను ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం బడ్జెట్లో ప్రతిపాదనపెట్టి కట్టాలని, బడ్జెట్ నిధులతోనే కట్టాలని, సబ్ ప్లాన్ నిధులతో కాదని హర్షకుమార్ అన్నారు.
Updated Date - 2023-12-01T13:45:02+05:30 IST