ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha : బోటు ప్రమాదానికి కారణాలేంటో తేల్చిన పోలీసులు

ABN, First Publish Date - 2023-11-20T11:00:17+05:30

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ప్రమాద ఘటన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తూ, వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ప్రమాద ఘటన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తూ, వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పార్టీ చేసుకున్న వారు ఎవరు..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీలో ఒక యూట్యూబర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-20T11:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising