ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Global Investors Summit: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెద్ద హైడ్రామా’

ABN, First Publish Date - 2023-03-05T11:28:30+05:30

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) పెద్ద హైడ్రామ అని సీఐటీయు (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ నరసింగరావు (Narasingarao) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) పెద్ద హైడ్రామ అని సీఐటీయు (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ నరసింగరావు (Narasingarao) విమర్శించారు. పెట్టుబడుదారులకు భూములను ఇవ్వడానికే మాత్రమే సమ్మిట్ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా గ్రౌండ్ అయ్యే పరిశ్రమలు ఎన్ని? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు, కార్మికులకు వ్యతిరేక ప్రభుత్వం జగన్ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ బండారం బయటపడిన తర్వాత కూడా విశాఖకు తీసుకురావడం రాష్ట్రానికి అవమానమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రభుత్వంగా మార్చేశారని విమర్శించారు. అదానీ, రిలయన్స్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీలో జూట్ మిల్లులు, డెయిరీలు ,ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు మూసివేశారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర పారిశ్రామిక విధానంపై శ్రేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాగా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభమైంది. సీఎం జగన్ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ Global Investors Summit ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు పరిమళ్‌ నత్వానీతో కలిసి దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ విశాఖకు చేరుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జీఐఎస్‌ సమ్మిట్‌ ప్రాంగణానికి చేరుకున్న అంబానీకి.. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అమర్‌నాథ్, విడదల రజిని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖేష్‌ అంబానీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ఈ సదస్సుకు హాజరయ్యారు.

Updated Date - 2023-03-05T11:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising