ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: మద్యం ద్వారా రూ. 94వేల కోట్లు దోచుకున్న జగన్: అనిత

ABN, First Publish Date - 2023-10-09T12:17:58+05:30

విశాఖ: తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీఎం జగన్‌పై కామెంట్స్ చేశారు. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారని.. మడమ తిప్పారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.94 వేల కోట్లు మద్యం ద్వారా జగన్ దోచుకున్నారని ఆరోపించారు.

విశాఖ: తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) సీఎం జగన్‌ (CM Jagan)పై కామెంట్స్ చేశారు. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారని.. మడమ తిప్పారని అన్నారు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.94 వేల కోట్లు మద్యం ద్వారా జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల రక్త మాంసాన్ని మద్యం ద్వారా తింటున్నారని, నాసిరకం మద్యం ద్వారా ప్రాణాలు తీసుకుంటున్నారని, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. ఓట్లు అడుగుతామని అన్నారని.. ఆ దమ్ము జగన్‌కు ఉందా? అని అనిత సవాల్ చేశారు. జగన్ మద్యం బ్రాండ్‌లలో విషతుల్యం ఉందని, లేబరేటరీలో నివేదికలు అవే చెబుతున్నాయన్నారు.

కల్తీ మద్యం తాగి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, నాలుగేళ్లలో ఎన్నో పుస్తులు తెగాయని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు తాగి పడిపోవాలి.. చనిపోవాలనేది జగన్ కాన్సెప్ట్ అని విమర్శించారు. తాగుడు ద్వారా వచ్చే డబ్బులతో సంక్షేమం చేస్తున్నామని అంటారా?.. జగన్ చేసేవన్నీ వేదవ పనులని, ఇంటింటికీ డాక్టర్ పధకం ఒక బోగస్ అని, ఎంత మందికి మందులు ఇస్తున్నారు?.. ఆసుపత్రుల పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చంద్రబాబు హయాంలో హ్యాపీ ఇండెక్స్ ఉంటే.. జగన్ హయాంలో స్ట్రెస్ ఇండెక్స్ ఉందని అనిత విమర్శించారు. ఆడపిల్లపై అఘాత్యాలు పెరిగిపోవడానికి కారణం మద్యమేనన్నారు. సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు జగన్ దోచేస్తున్నారని ఆరోపించారు. గడప గడపకు జగనన్న మద్యం పథకం పెడితేసరి.. కోడి, గుడ్డు మీద ఉన్న శ్రద్ధ... మద్యపాన నిషేధంపై మంత్రి గుడివాడ అమర్‌కు లేదన్నారు. మద్యపాన నిషేధం అమలు చేయనప్పుడు.. నవరత్నాలు స్టిక్కర్‌లో మద్యపానం ఎందుకని అనిత ప్రశ్నించారు.

Updated Date - 2023-10-09T12:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising